Farmers Protest: ఢిల్లీలో రైతుల మహా పంచాయత్.. భారత్-అమెరికా ఒప్పందంపై ఆగ్రహం
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్‌కు చెందిన వందలాది మంది రైతులు ఢిల్లీలోకి చేరుకున్నారు. కిసాన్ ఘాట్‌లో నేడు దేశ్ బచావో మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న'మహా పంచాయత్'లో వారు పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 550 రైతు సంఘాలు,సామాజిక సంస్థలు ఈ నిరసనకు మద్దతుగా హాజరవుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే భారత రైతులు, వ్యవసాయ కూలీలు,చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ (కేఎంఎస్సీ) నేత జర్మన్‌జిత్ సింగ్ బండాల ఆరో...