Nara Lokesh Distributes House Titles In Mangalagiri | అమరావతి: ఏపీ ప్రభుత్వం రూ.1000 కోట్ల విలువైన ఆస్తులను పేదలకు పంపిణీ చేసింది. ఏపీ మంత్రి నారా లోకేష్
తన నియోజకవర్గంలో దాదాపు 3 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి వారి జీవితంలో సంతోషాన్ని నింపారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తోందని నారా లోకేష్ స్పష్టం చేశారు. సొంత నియోజకవర్గం మంగళగిరిలో 'మన ఇల్లు- మన లోకేష్' కార్యక్రమం ద్వారా 3000 మంది పేద కుటుంబాలకు స్వయంగా ఇళ్ల పట్టాలను మంగళవారం ఉదయం పంపిణీ చేశారు.
2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దాదాపు రూ.1000 కోట్ల విలువైన ఆస్తులను భూమి పట్టాల రూపంలో నిరుపేదలకు అందించామని నారా లోకేష్ తెలిపారు. ఈ శాశ్వత భూపట్టాలు ఉండటం వల్ల పేదల ఆస్తులకు పూర్తి రక్షణ ఉంటుందన్నారు. ఇకపై వాటిని ఎవరూ కదిలించలేరని ఈ సందర్భంగా పేదలకు నారా లోకేష్ హామీ ఇచ్చారు.
"మన ఇల్లు – మన లోకేశ్" కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా 3,000 మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. సుమారు ₹1,000 కోట్ల విలువైన ఆస్తిని ఇంటి పట్టాల రూపంలో అందజేస్తూ వేలాది కుటుంబాల సొంతింటి కలను సాకారం చేశారు. #ManailluManaLokesh… pic.twitter.com/X2bHvUFrsT
— Telugu Desam Party (@JaiTDP) July 21, 2026
కూటమి ప్రభుత్వంలో మెరుగైన ఆర్థిక పరిస్థితి
గత వైసీపీ ప్రభుత్వంలో అంతా విధ్వంసమేనని, కూటమి ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగైందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో ఆదాయం ఒక్క రూపాయి ఉంటే ఖర్చులు మాత్రం రూ.1.60 ఉండేదన్నారు. గడిచిన రెండేళ్లలో చంద్రబాబు నాయకత్వంలో సమిష్టి అభివృద్ధితో ఆ ఖర్చును రూ.1.40కి తగ్గించుకున్నట్లు నారా లోకేష్ తెలిపారు. 2019 ఎన్నికల ఓటమి సమయంలో తనను అవహేళన చేశారని, వై నాట్ కుప్పం అంటూ చంద్రబాబును టార్గెట్ చేశారని గుర్తుచేసుకున్నారు. ఎలాగైనా నెగ్గాలన్న ఆ కసితోనే ఓడిన చోటే ప్రజల మద్దతు సాధించి మంగళగిరిలో విజయం సాధించానని పేర్కొన్నారు. ప్రస్తుతం మంగళగిరిని అభివృద్ధికి కెరాఫ్ అడ్రస్‌గా మారుస్తున్నానని పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్ది చూపిస్తానని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.
#TallikiVandanam
— Lokesh Nara (@naralokesh) July 20, 2026
మంగళగిరి కొండపనేని టౌన్ షిప్ పార్క్ లో మంగళగిరి నియోజకవర్గ తల్లికి వందనం పథకం లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించాను. తల్లికి వందనం పథకం అందుతున్న తీరు, ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం ఏ విధంగా ఉపయోగపడుతోందనే విషయాలపై ఆరా తీశాను. విద్యార్థుల తల్లుల… pic.twitter.com/eaEwUUVXjL
మంగళగిరిలో నిన్న తల్లికి వందనం పథకం లబ్ధిదారులతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. తల్లికి వందనం పథకం అందుతున్న తీరు, ఆర్థిక సాయం ఉపయోగపడే తీరుపై మహిళలతో చర్చించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. చిన్నప్పుడు తన తల్లి తనను చిదకబాదేదని పాత రోజులను గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు సైతం ఎదైనా మీటింగ్ లో చేసిన కామెంట్లు చేసి, అలా మాట్లాడావు ఏంటీ.. ఇంకా బాగా మాట్లాడాలని సలహాలు , సూచనలు ఇస్తారని నారా లోకేష్ ఆసక్తి విషయాలు తెలిపారు.














