Christopher Nolan The Odyssey Box Office Collections : హాలీవుడ్ మాస్టర్ మైండ్ క్రిస్టోఫర్ నోలన్ క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఆయన మూవీ
వస్తుందంటే వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద పండుగే. నోలన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'ది ఒడిస్సీ' (The Odyssey). హాలీవుడ్ నటుడు మాట్ డామన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ వీకెండ్ రికార్డు కలెక్షన్స్ సాధించింది. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా మూడు రోజుల్లోనే రూ.వేల కోట్ల వసూళ్లు సాధించింది.
3 రోజుల్లో...
ఫస్ట్ వీకెండ్లో మొదటి మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 'ది ఒడిస్సీ' ప్రపంచవ్యాప్తంగా 264 మిలియన్ డాలర్లకు (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.2,548 కోట్లు) పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. నోలన్ కెరీర్లోనే ఇవే బెస్ట్ ఓపెనింగ్స్. ఈ మేరకు యూనివర్సల్ పిక్చర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. మొదటి మూడు రోజుల్లో నార్త్ అమెరికా నుంచే 124 మిలియన్ డాలర్లు వచ్చినట్లు వెల్లడించింది.
ఫస్ట్ డే ఇండియావ్యాప్తంగా రూ.20.76 కోట్లతో రికార్డు క్రియేట్ చేయగా... రూ.17.40 కోట్లు నెట్ కలెక్షన్స్ సాధించింది. వరల్డ్ వైడ్‌గా 39.8 మిలియన్ డాలర్లు (రూ.375 కోట్లు) గ్రాస్ వసూళ్లు సాధించింది. గతంలో నోలన్ మూవీస్ రికార్డులను 'ది ఒడిస్సీ' బ్రేక్ చేసింది. ఆయన దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన 'ది డార్క్ నైట్ రైజెస్' (249 మిలియన్ డాలర్స్), 'ఒప్పెన్ హైమర్' (181 మిలియన్ డాలర్స్) ఫస్ట్ వీకెండ్ వసూళ్లను ఇది క్రాస్ చేసింది.
Also Read : This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఈ మూవీలో మాట్ డామన్ ప్రధాన పాత్రలో నటించగా... టామ్ హాలెండ్, అన్నీ హథవే, జెండయా, లుస్టియా న్యోంగో, ఛార్లెజ్ థీరన్, రాబర్ట్ ప్యాటిన్సన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. లుడ్విగ్ గోరాన్సన్ మ్యూజిక్ అందించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి కలెక్షన్స్‌తో 'ది ఒడిస్సీ' దూసుకెళ్తోంది.
స్టోరీ ఏంటంటే?
గ్రీక్ జానపద కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. తన తెలివితేటలతో ట్రాయ్ రాజ్యాన్ని ఓడించిన ఒడిస్సియస్ (మాట్ డామన్)... దాదాపు పదేళ్లుగా సాగుతున్న ట్రోజన్ వార్‌కు ముగింపు పలుకుతాడు. ఆ తర్వాత సైన్యంతో కలిసి తన రాజ్యం ఇథాకాకు సముద్ర మార్గంలో ప్రయాణిస్తాడు. అతని రాక కోసం భార్య పెనెలోప్ (అన్నీ హాథవే), కొడుకు టెలిమాకస్ (టామ్ హాలెండ్) ఎదురుచూస్తుంటారు. ఒడిస్సియస్ ఇక రాడని... తనను పెళ్లి చేసుకోవాలంటూ పెనెలోప్‌ను ఆంటినస్ (రాబర్ట్ పాటిన్సన్) ఒత్తిడి చేస్తుంటాడు. తన శక్తియుక్తులతో ఆమెను తన వశం చేసుకోవాలని యత్నిస్తుంటాడు.
ఇథికాకు చేరుకోవాల్సిన ఒడిస్సియస్కు సముద్ర ప్రయాణంలో ఎలాంటి ఆపదలు ఎదురయ్యాయి? గ్రీకు దేవతలు అతనిపై ఎందుకు కోపం చూపించారు? పది రోజుల ప్రయాణం పదేళ్లు ఎందుకు పట్టింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read : Jani Master : జానీ మాస్టర్‌కు బిగ్ రిలీఫ్ - మెగాస్టార్, బాలయ్య ఎంట్రీతో కాంట్రవర్సీకి చెక్
NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.














