Iran Missile Program Latest News | టెహ్రాన్: మిడిల్ ఈస్ట్ (పశ్చిమాసియా)లో ఇరాన్, అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలే కనిపించడం లేదు. ఇరాన్ ఫతా
1, ఫతా 2 హైపర్సోనిక్ మిసైళ్లు ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇందుకు కారణం ఇవి అత్యంత వేగంగా దూసుకెళ్తాయి. ప్రయాణించే సమయంలో దిశను సైతం మార్చుకోవడం, ఆధునిక మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌లను సైతం తట్టుకుని శత్రువులపై దాడి చేయగల సామర్థ్యం వీటికి ఉంది. ఇరాన్ ఈ మిసైళ్లను తన మిసైల్ ప్రోగ్రామ్‌లో ఒక పెద్ద విజయంగా పేర్కొంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, అమెరికా తయారీ పేట్రియాట్, THAAD సిస్టమ్స్ వంటి అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ నెట్‌వర్క్‌ల కన్నుగప్పి ఈ మిసైల్ దూసుకెళ్లగలదని ఇరాన్ అధికారులు క్లెయిమ్ చేశారు.
ఇరాన్ తొలి హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్
ఇరాన్ జూన్ 2023లో ఫతా 1 మిస్సైల్‌ను అధికారికంగా పరిచయం చేసింది. దీనిని దేశంలోనే తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసిన హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్‌గా ఇరాన్ అభివర్ణించింది. ఇరాన్ అధికారుల సమాచారం ప్రకారం, ఈ మిసైల్ మ్యాక్ 13 నుండి మ్యాక్ 15 వేగంతో ప్రయాణిస్తుంది. అంటే ధ్వని వేగం కంటే దాదాపు 13 నుండి 15 రెట్లు వేగంగా వెళ్తుంది. గంటకు దాదాపు 18,500 కిలోమీటర్లు గరిష్ట వేగంతో దూసుకెళ్లగలదు.
ఈ మిసైల్ ఆపరేషనల్ రేంజ్ దాదాపు 1400 కిలోమీటర్లు. దీనివల్ల ఇది మిడిల్ ఈస్ట్‌లోని ప్రధాన ప్రాంతాలను ఈజీగా టార్గెట్ చేసే సత్తా ఉంది. తన గరిష్ట వేగంతో ఇది కేవలం 6 నుండి 7 నిమిషాలలోనే లక్ష్యాన్ని చేరుకోగలదని సమాచారం. ఈ మిసైల్‌ను 200 నుండి 450 కిలోగ్రాముల బరువున్న సంప్రదాయ వార్‌హెడ్‌ను తీసుకెళ్లేలా డిజైన్ చేశారు.
దీని అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే, రెండవ దశలో దీనికున్న మూవబుల్ నాజిల్ (కదిలే నాజిల్) మరియు సాలిడ్ ఫ్యూయల్ ప్రొపల్షన్ సిస్టమ్. ఇరాన్ ప్రకారం, ఈ టెక్నాలజీ మిసైల్ తన ప్రయాణపు చివరి దశలో దిశను మార్చుకునేలా సహాయపడుతుంది. దీనివల్ల సంప్రదాయ బాలిస్టిక్ మిసైళ్లతో పోలిస్తే దీనిని అడ్డుకోవడం చాలా కష్టంగా మారుతుంది. అమెరికా లాంటి అగ్ర దేశాలను ఎదుర్కోవాలంటే మోడ్రన్ టెక్నాలజీ, పవర్ఫుల్ మిస్సైల్స్ సామర్థ్యం తప్పనిసరి అని ఇరాన్ అగ్రనేతలు అభిప్రాయపడుతున్నారు.
Also Read: UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
మిసైల్ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఫేజ్ ఫలా 2
ఫతా 2 అనేది ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్ నెక్ట్స్ ఫేజ్ అని చెప్పవచ్చు. సంప్రదాయ బాలిస్టిక్ మిసైల్ ఒక నిర్దిష్ట మార్గంలో ప్రయాణిస్తుంది. కానీ ఫతా 2లో హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ టెక్నాలజీని ఉపయోగించినట్లు తెలుస్తోంది. కొత్త టెక్నాలజీ ద్వారా మిస్సైల్ లాంచ్ చేసిన తర్వాత, ఈ గ్లైడ్ వెహికల్ నిరంతరం దిశను మార్చుకుంటూ భూమి వాతావరణం లోపల, వెలుపల కూడా ప్రయాణించగలదు. ఈ ప్రయాణ మార్గం కారణంగా రాడార్ సిస్టమ్స్ దీని మార్గాన్ని అంత సులువుగా గుర్తించలేవు. లేదా ఇంటర్‌సెప్టర్ మిసైళ్లు దీనిని అడ్డుకోవడం చాలా కష్టమని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు. ఫతా 2 మిసైల్ రేంజ్ దాదాపు 1400 నుండి 1500 కిలోమీటర్లు అని ఇరాన్ క్లెయిమ్ చేసింది.















