నేడు జూలై 20వ తేదీ సోమవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. బంగారం ధర పెరగడం లేదా తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న పరిస్థితులే అని చెప్పవచ్చు.
సాధారణంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 141,630 పలుకుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 129,828 పలుకుతోంది. బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గినట్లు గమనించవచ్చు. బంగారం ధరలు గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ వారం ప్రారంభం నుంచి కూడా బంగారం ధరలు తగ్గడం చూడవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో గమనించినట్లయితే, ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం ధర 4000 డాలర్లు కన్నా తక్కువగా పలుకుతోంది. బంగారం ధరలు గడచిన ఏడాదికాలంగా గమనించినట్లయితే దాదాపు 50 శాతం వరకు పెరిగినట్లు చూడవచ్చు. అయితే ఒక దశలో 2026 జనవరి నెలలో బంగారం ధర ఏకంగా 1.83 లక్షల రూపాయల వరకు వెళ్లింది. మళ్లీ అక్కడ నుంచి బంగారం ధర నెమ్మదిగా తగ్గడం గమనించవచ్చు. అయితే భవిష్యత్తులో బంగారం ధర తగ్గుతుందా లేదా పెరుగుతుందా అనేది అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చే పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం డాలర్ విలువ బలపడుతున్న నేపథ్యంలోనే బంగారం ధరలు తగ్గుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. డాలర్ విలువ పెరిగే కొద్దీ కూడా బంగారం ధర తగ్గుతుంది. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు కనుక భవిష్యత్తులో పెంచినట్లయితే బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బంగారం మార్కెట్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పైన ఎక్కువగా నమ్మకం పెట్టుకుంది అని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ వడ్డీ రేట్లు కనుక పెరిగినట్లయితే బంగారం ధర విపరీతంగా తగ్గే అవకాశం ఉంటుంది. లేదా వడ్డీ రేటులను తగ్గించినట్లయితే మాత్రం బంగారం ధర పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం తగ్గి వస్తున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లో గమనించినట్లయితే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగింది. నగల షాపుల్లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారు నెమ్మదిగా క్రమంగా పెరుగుతున్నారు. అయితే భవిష్యత్తులో బంగారం ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనే కన్ఫ్యూజన్ ఉండడం వల్ల చాలా మంది బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం బంగారం ధర ఆల్ టైం రికార్డ్ తో పోల్చి చూస్తే దాదాపు 40 వేల రూపాయలు తక్కువగా పలుకుతోంది దీంతో మళ్లీ బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. బంగారం ధర మార్కెట్లో 22 క్యారెట్ల విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత 1.30 లక్షల రూపాయల కన్నా తక్కువ పలుకుతోంది. ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది ఊరట కల్పించే అంశంగా చెప్పవచ్చు. కానీ తగ్గుతున్న బంగారం ధరలు మాత్రం బంగారంలో గతంలో ఇన్వెస్ట్ చేసిన వారికి మాత్రం నష్టాలను చూపించాయి అని చెప్పవచ్చు.














