బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి మాత్రమే కాకుండా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా కొన్ని సందర్భాల్లో చందాదారులకు కొన్ని సందర్భాల్లో లోన్ తీసుకునే సదుపాయం
ఉంటుంది. పీపీఎఫ్ ద్వారా లోన్ తీసుకోవచ్చనే విషయం చాలా మందికి తెలియదు. అయితే ఎమర్జెన్సీగా డబ్బులు అవసరమైనప్పుడు పీపీఎఫ్ లోన్, పర్సనల్ లోన్( PPF loan vs Personal Loan )...రెండింట్లో ఏది తీసుకోవడం బెటర్ అనే విషయాలు తెలుసుకుందాం! బ్యాంకుల నుండి మాత్రమే కాకుండా ,కొన్ని నిర్దిష్టమైన సందర్భాల్లో పీపీఎఫ్ ఖాతా కలిగిన వారు కూడా లోన్ తీసుకోవచ్చు. పీపీఎఫ్ లోన్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) ఖాతాదారులు కొన్ని నిర్దిష్టమైన సందర్భాల్లో లోన్ తీసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ రూల్స్ ప్రకారం, పీఎఫ్ ఖాతాదారులు అకౌంట్ ఓపెన్ చేసిన మూడో ఆర్థిక సంవత్సరం నుండి ఐదో ఆర్థిక సంవత్సరం చివరి వరకు లోన్ పొందవచ్చు. పీపీఎఫ్లోన్కు వడ్డీ రేట్లు ఎలా ఉంటాయంటే... పీపీఫ్ లోన్ ద్వారా తీసుకునే డబ్బులకు వడ్డీ అనేది వడ్డీ రేటుకు 1 శాతం అదనంగా ఉటుంది. తీసుకున్న అప్పుడున సాధారణంగా 36 నెలల్లో రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ గడువులోగా చెల్లించకపోతే అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. పర్సనల్ లోన్ పీపీఎఫ్ లోన్‌తో పోల్చుకుంటే పర్సనల్ లోన్ ఒక అన్సెక్యూర్డ్ లోన్. దీనిని బ్యాంకులు రుణ గ్రహీత సిబిల్ స్కోర్, క్రెడిట్ ప్రొఫైల్, ఆదాయం, వయ్ససుతో పాటు మరికొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని జారీ చేస్తాయి. పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు సాధారణంగా 8 శాతం నుండి 9 శాతంగా ఉండవచ్చు. అయితే వడ్డీ రేటు అనేది రుణగ్రహీత సిబిల్ స్కోర్, తీసుకున్న అప్పు, రీపేమెంట్ గడువుపై ఆధారపడి ఉంటుంది. పర్సనల్ లోన్, పీపీఎఫ్ లోన్... మధ్య తేడా ఏంటి ? పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా కలిగి ఉన్న వారు మాత్రమే పీపీఎఫ్ లోన్ పొందవచ్చు. పర్సనల్ లోన్ అనేది బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు జారీచేసి అన్సెక్యూర్డ్ లోన్. ఎలాంటివి తాకట్టు పెట్టకుండా లోన్ తీసుకోవచ్చు. ఎడ్యుకేషన్, వివాహం, ట్రావెల్, మెడికల్ ఖర్చులు ఇలా వివిధ అవసరాల కోసం పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. పర్సనల్ లోన్‌తో పోల్చితే పీపీఎఫ్ లోన్‌కు వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. రెండింట్లో ఏది బెస్ట్ ! పీపీఎఫ్ లోన్‌కు వడ్డీ తక్కువగా ఉన్నప్పటికీ ఖాతాలోని డబ్బులో కొంత శాతాన్ని మాత్రమే లోన్‌గా పొందవచ్చు. పర్సనల్ లోన్ విషయంలో క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా ఎక్కువ మొత్తంలో డబ్బును లోన్‌గా పొందవచ్చు. పీపీఎఫ్ అకౌంట్ కలిగి ఉండి, తక్కువ మొత్తంలో డబ్బు అవసరమైతే పీపీఎఫ్ లోన్ తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వడ్డీ తక్కువగా ఉంటుంది. ఒక వేళ ఎక్కువ మొత్తంలో డబ్బులు అవసరం ఉంటే, పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. అయితే రెండింట్లో ఏది బెట్స్ అనేది మీ వ్యక్తిగత ఆర్థిక అవసరాలను బట్టి ఉంటుంది. కాబట్టి ఏది బెస్ట్ అనేది మీ అవసరాలు, పరిస్థితులను బట్టి నిర్ణయించుకోవాలి. గమనిక: పైన తెలిపిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, దీనిని ఏ విధంగానూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించకూడదు. ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం ఆర్థిక నిపుణుల సలహా తీసుకోడం మంచిది.














