బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో రక రకాలుగా తక్కువ ధరకు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు కస్టమర్లు తమ ప్రయత్నాలు చేస్తన్నారు. ముఖ్యంగా బంగారం కొనుగోలు విషయంలో
అత్యంత ముఖ్యమైనది నాణ్యత అయితే ఇందులో కొద్ది పాటి తేడాలతో ఇతర క్వాలిటీ బంగారు ఆభరణాలను సైతం నగల షాపుల వారు విక్రయిస్తున్నారు. అలా ప్రాచుర్యంలోకి వచ్చిందే వైట్ గోల్డ్, రోజ్ గోల్డ్ అని చెప్పవచ్చు. వైట్ గోల్డ్: ఇప్పుడు వైట్ గోల్డ్ అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం. వైట్ గోల్డ్ అంటే ఇందులో బంగారంతో పాటు, నికెల్, పల్లాడియం, సిల్వర్ కలిపి తయారు చేస్తారు. అలాగే ఇది వెండి రంగులో ఉంటుంది అందుకే దీన్ని వైట్ గోల్డ్ అని పిలుస్తారు. సిల్వర్ లుక్ కోసం రోడియం కోటింగ్ వేస్తారు. సాధారణంగా వైట్ గోల్డ్ ను 18 క్యారట్ బంగారం క్వాలిటీలో విక్రయిస్తారు. అలాగే 14k లో కూడా ఇవి ఉంటాయి. వైట్ గోల్డ్ తో ఉంగరాలు, కాళ్ల పట్టీలు అలాగే డైమండ్ నెక్లెసుల్లో వినియోగిస్తారు. వీటిపై కూడా బీఐఎస్ హాల్ మార్క్ ఉంటుంది. అలాగే వీటిలో కూడా హెచ్యుఐడీ నెంబర్ ఉందా లేదా అనేది గుర్తించాల్సి ఉంటుంది. రోజ్ గోల్డ్: ఇందులో బంగారంతో పాటు రాగి కలపడం వల్ల బంగారం గులాబి రంగులోకి వస్తుంది. ఇది కూడా సాధారణంగా 18 క్యారట్ బంగారం క్వాలిటీలో లబిస్తుంది. ఇందులో కూడా బీఐఎస్ హాల్ మార్క్ గుర్తించాల్సి ఉంటుంది. అలాగే ఇందులో HUID నెంబర్ ఉందో లేదో గుర్తించాలి. ఇందులో వైట్ గోల్డ్ తరహాలో ప్రత్యేక మైన కోటింగ్ ఏమి ఉండదు. ఎందుకంటే సహజంగానే బంగారంలో కాపర్ కలపడం వల్ల రోజ్ గోల్డ్ పింక్ కలర్ లో కనిపిస్తుంది. వైట్ గోల్డ్, రోజ్ గోల్డ్ ధరలు ఎలా ఉంటుాయి.. మార్కెట్లో వీటి ధరలు 24 క్యారట్ల బంగారం ధరల ఆధారంగా మార్పులు ఉంటాయి. అంతే కాదు బంగారం ధరలు సాధారణంగా అందులోని బంగారం పరిమాణం, మేకింగ్ చార్జీలు, తరుగును బట్టి వసూలు చేస్తుంటారు. అయితే బంగారంలోని నాణ్యత ఆధారంగానే ఈ ధరలను నిర్ణయిస్తారు. రీసేల్ వ్యాల్యూ ఉంటుందా..? సాధారణంగా బంగారం రీసేల్ సమయంలో ఆ ఆభరణంలోని బంగారం ప్యూరిటీని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వేల్యూ నిర్ణయిస్తారు. చాలా సందర్భాల్లో వైట్ గోల్డ్ లో వజ్రాలు, లేదా ఇతర రత్నాలు, రాళ్లు వంటివి ఉంటాయి. వీటిలో వజ్రాలకు మాత్రమే రీసేల్ వ్యాల్యూ ఉంటుంది. మిగితా రాళ్లు, రత్నాలు వేల్యూ ఉండదు. కనుక చివరకు మీకు వైట్ గోల్డ్ లేదా రోజ్ గోల్డ్ కు మాత్రమే వేల్యూ లభిస్తుంది. ఇది ఇన్వెస్ట్ మెంట్ కు మంచిదా..? సాధారణంగా 18 క్యారట్ బంగారం ఇన్వెస్ట్ మెంట్ కోసం అంత మంచి ఛాయిస్ కాదు. ఫిజికల్ గోల్డ్ లో ఇన్వెస్ట్ మెంట్ చేయాలి అనుకునే వారికి 24 క్యారట్ క్వాలిటీ కలిగిన గోల్డ్ బిస్కెట్లు, కాయిన్స్, కడ్డీలు నాణ్యమైనవి.














